భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవం వైభవంగా జరిగింది. లక్ష్మణ సమేత సీతారాములు ఉత్తర ద్వారం నుంచి దర్శనం ఇవ్వగా... భక్త జన సందోహం ఆనందంతో పరవశించి పోయారు.
తెల్లవారుజాము నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుప్రభాత సేవ అనంతరం లక్ష్మణ సమేత సీతారాములకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. స్వామివారి అలంకరణ తర్వాత ఉత్తర ద్వారం నుంచి దర్శనమిచ్చారు. గరుడ వాహనంపై శ్రీరామచంద్రుడు, గజవాహనంపై సీతమ్మ, హనుమంత వాహనంపై లక్ష్మణుడు పూజలు అందుకున్నారు. సకల రాజలాంఛనాలతో వేద పండితులు, అర్చకులు స్వామివారికి పూజలు నిర్వహించారు. కరోనా దృష్ట్యా భక్తులెవర్నీ అనుమతించకపోవడంతో భక్తులు దూరం నుంచే స్వామివారిని దర్శించుకున్నారు.
ఇదీ చూడండి: వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏమిటి?