భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపల్ కార్యాలయంలో ఓ ఉద్యోగి అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. 7 నెలల క్రితం అనిల్ అనే ఏఈ రూ.70 వేలు లంచం తీసుకొని దొరకగా.. తాజాగా నిన్న ఇంఛార్జ్‌గా ఉన్న బాబు కాంట్రాక్టర్ బిల్లులు మంజూరు చేసేందుకు రూ. 20 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయారు.
ఇల్లందు పట్టణంలో గడిచిన ఏడు నెలల్లో ఇద్దరు పురపాలక ఏఈలు లంచాలు తీసుకుంటూ దొరికిపోవడం పట్టణంలో జరిగిన అభివృద్ధి పనులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పనుల నాణ్యత పరిశీలించి బిల్లు చెల్లింపు చేయాల్సిన అధికారులే బిల్లుల కోసం లంచాలు డిమాండ్ చేస్తూ దొరికిపోవడం పట్టణ వాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇదీ చూడండి : ఉర్రూతలూగించిన గీతం స్టూడెంట్ ఫెస్ట్