భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ముదిరాజ్ బజార్, శిల్పినగర్ కాలనీకి చెందిన ఓ యువకుడు, ఓ బాలుడు గోదావరి నదిలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. శిల్పి నగర్ కాలనీకి చెందిన పవన్ కుమార్(19), ముదిరాజ్ బజార్ కాలనీకి చెందిన తులసీరామ్(12) ఇద్దరు స్నానానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు గల్లంతు కావడం వల్ల పోలీసులు పడవలు, గజ ఈతగాళ్ల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. ఇద్దరు విద్యార్థులు గల్లంతు కావడం వల్ల విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇవీ చూడండి: చేపల వేటకు వెళ్లాడు.. విగతజీవిగా వచ్చాడు..