భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో మంత్రి సత్యవతి రాఠోడ్ వాహనాన్ని ఆర్టీసీ ఉద్యోగులు, వామపక్ష నాయకులు అడ్డుకున్నారు. భద్రాచలంలో పలు సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లిన మంత్రి సత్యవతి రాఠోడ్ వాహనానికి అడ్డుపడి నిరసన తెలిపారు. పోలీసులు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగి కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు లాఠీచార్జీ చేయడం వల్ల పలువురికి గాయాలయ్యాయి. ఆర్టీసీ కార్మికులను, ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని పీఎస్కు తరలించారు.
ఇదీ చదవండిః కలికాలమంటే ఇదేనేమో.. నదీ ఒడ్డునే ఇసుక విక్రయం