భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన సాయి ఆర్టీసీ బస్సు తాత్కాలిక డ్రైవర్గా పనిచేస్తున్నాడు. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ... డిపో వద్ద కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు మహిళా కండక్టర్లు.. తమ వైపు చేయి చూపిస్తూ తాత్కాలిక చోదకుడు సాయి అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపించారు. అక్కడే ఆందోళన చేస్తున్న మరికొందరు ఆర్టీసీ కార్మికులు.. సాయిని అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి దిగారు. విషయం తెలుసుకున్న సీఐ సంఘటనాస్థలికి చేరుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పారు. ఆర్టీసీ మహిళా కండక్టర్లు, తాత్కాలిక డ్రైవర్ పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు.
తాత్కాలిక డ్రైవర్ను చితకబాదిన ఆర్టీసీ కార్మికులు - telangana rtc employees strike 2019
మహిళా కండక్టర్లతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ తాత్కాలిక డ్రైవర్ను ఆర్టీసీ కార్మికులు చితకబాదిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో చోటుచేసుకుంది.
![తాత్కాలిక డ్రైవర్ను చితకబాదిన ఆర్టీసీ కార్మికులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4897231-1012-4897231-1572333866849.jpg?imwidth=3840)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన సాయి ఆర్టీసీ బస్సు తాత్కాలిక డ్రైవర్గా పనిచేస్తున్నాడు. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ... డిపో వద్ద కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు మహిళా కండక్టర్లు.. తమ వైపు చేయి చూపిస్తూ తాత్కాలిక చోదకుడు సాయి అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపించారు. అక్కడే ఆందోళన చేస్తున్న మరికొందరు ఆర్టీసీ కార్మికులు.. సాయిని అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి దిగారు. విషయం తెలుసుకున్న సీఐ సంఘటనాస్థలికి చేరుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పారు. ఆర్టీసీ మహిళా కండక్టర్లు, తాత్కాలిక డ్రైవర్ పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు.
మణుగూరు.
మణుగూరు ఆర్టీసీ డిపో పరిధిలో తాత్కాలిక డ్రైవర్ గా పని చేస్తున్న వాల్లెపు సాయి ఆర్టీసీ మహిళా కండక్టర్ ల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో అతని పై ఆర్టీసీ కార్మికుల దాడి చేసిన ఘటన సోమవారం చోటు చేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించి ఆర్టీసీ కార్మికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మణుగూరు పట్టణానికి చెందిన సాయి కొద్దిరోజులుగా డిపో లో తాత్కాలిక డ్రైవరు గా పనిచేస్తున్నాడు. విధులు ముగించుకుని డిపో లోకి వెళుతున్న క్రమంలో డిపో ఎదుట నిరసన దీక్ష వద్ద కూర్చొని ఉన్న కొంత మంది మహిళా కండక్టర్ ల పట్ల బస్సులో నుంచి సాయి తన చేతిని చూపిస్తే అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో మహిళా కండక్టర్ వెంటనే అక్కడ విధులు నిర్వర్తించే ఎస్సై కి విషయాన్ని తెలిపారు.Conclusion:కొద్ది సమయం తర్వాత డిపో నుంచి బయటకు వచ్చిన సాయిని మహిళా కండక్టర్ లు ఎందుకలా ప్రవర్తించావని ప్రశ్నించారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం జరిగింది . ఆ సమయంలో ఆర్టీసీ కార్మికులు సాయి పై దాడి చేశారు . విషయం తెలుసుకున్న సిఐ శుకూర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఈ ఘటనపై ఆర్టీసీ మహిళా కండక్టర్లు, త్కాలిక డ్రైవరు, ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు.