దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి పథకాలు తెరాస ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తోందని ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఎవరిని అడిగినా ఆ విషయం తెలుస్తుందని పేర్కొన్నారు. కేసీఆర్ సర్కారు అధికారంలోకి వచ్చాక ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిందన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో పల్లా పర్యటించారు. కళాశాలల, పాఠశాలల అధ్యాపకులను, న్యాయవాదులను కలిసి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: తెలంగాణ ఉద్యమ తరహాలో పోరాడుతాం: వినయ్‌భాస్కర్