ఆరోగ్యాన్ని మించిన సంపద లేదని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు తెలిపారు. రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్, తెరాస కల్చరల్ విభాగం ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు మండలం పరిధిలో నిర్వహించిన 5కె రన్ పోటీలను ఆయన ప్రారంభించారు.
అనారోగ్యం దరిచేరకుండా వ్యాయామం మంచి మందులా ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే రేగ కాంతారావు అన్నారు. 5 కె రన్ పోటీలో క్రీడాకారులతో పాల్గొని వారిని ఉత్సాహపరిచారు. క్రీడల్లో యువతీయువకులు ప్రోత్సహించేందుకు గత మూడు రోజులుగా క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పోటీల్లో పాల్గొని క్రీడాకారులను అభినందించారు.
ఇదీ చదవండి: ఐఆర్‌సీటీసీ, టీఎస్ టీడీసీ ప్రత్యేక యాత్రలు