ETV Bharat / state

koya tribe : మనకు తెలియని గిరిపుత్రుల జీవన విధానం

author img

By

Published : Jul 8, 2021, 11:44 AM IST

Updated : Jul 8, 2021, 3:36 PM IST

చుట్టూ ఉన్న చెట్టూ చేమా వారి చుట్టాలు. పొద్దు పొడుపు మొదలు సంధ్య వేళ వరకు తమతో పాటు చెమటోడ్చే పశువులే వారికి ఆత్మీయులు. భయంకరమైన క్రూరమృగాలైనా వారికి నేస్తాలు. మన్యంలో ప్రతి అణువణువు వారికి సుపరిచితాలు.. వారే మన్యం బిడ్డలు. వరి అన్నం అంటే పండుగలకే చేసుకుంటారని.. తాగు నీరంటే గడ్డలో పారుతుందని.. రోడ్డు అంటే కొన్ని మైళ్ల దూరం వెళ్తే కనిపిస్తుందని.. ఆహారం అంటే వేటాడితే వస్తుందని.. ఇతర వస్తువులంటే వారం సంతలోనే దొరుకుతాయని వారిలో ఎవ్వరినడిగినా చెబుతారు. దండకారణ్యంలో గిరిజనులు(koya tribe) జీవనచిత్రంపై ఓ లుక్కేద్దాం.

koya tribes
koya tribes

పొరుగునున్న దేశాలకు చుట్టంచూపుగా వెళ్లొచ్చినంత సులభంగా చుట్టొస్తున్నాం. కొన్ని దశాబ్దాల తర్వాత ఏమి జరగబోతుందో ముందే కనిపెట్టేంత సాంకేతికత సాధించాం. అభివృద్ధి పథంలో రాకెట్​ కంటే వేగంగా దూసుకుపోతున్నాం. కానీ ఇప్పటికీ వారితో ఉన్న మానవాళి ఇంత అభివృద్ధి చెందిందని తెలియనివారున్నారంటే నమ్మశక్యంగా లేదు కదూ.. వారే అభివృద్ధికి ఆమడ దూరంలో.. ప్రకృతి ఒడిలో బతుకుతున్న గిరిజనులు. ఈ మధ్యకాలంలోనే వారి జీవణ ప్రమాణాలు కాస్త మెరుగుపడుతున్నాయి.

సామూహిక వంటా వార్పు
ఊరంతా ఒకే చోట

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో ఛతీస్​గఢ్​ సరిహద్దు అటవీ ప్రాంతంలో అనేక గిరిజన గ్రామాలున్నాయి. ఈ ప్రాంతంలో నివసించే ప్రధాన తెగ కోయ. సాధారణ ప్రజల జీవన విధానంతో పోలిస్తే వీరి జీవన విధానం పూర్తి భిన్నంగా ఉంటుంది. ప్రకృతే వారికి దేవాలయం.. అడవి దాటితే వారికి ఊపిరాడదు. కష్టం చేయందే వారికి పూట గడవదు. కాలాన్ని బట్టి అడవుల్లో లభించే కాయలు, దుంపలు, ఆకులు, పండ్లు వారి ఆహార వనరులు. వాగుల్లో పారే నీరే వారికి తాగునీరు. వీరు మాట్లాడే భాష కోయ. దీనికి లిపిలేదు. భారత రాజ్యాంగం ఐదో షెడ్యూల్​లోని గిరిజన తెగల్లో కోయలు ప్రధానమైన తెగ. కోయలను (koya tribe) వారి వృత్తులను బట్టి ఏడు వర్గాలుగా విభజించవచ్చు.

సామూహిక వంటా వార్పు
సామూహిక వంటా వార్పు

తొలకరితో మొదలవుతుంది

ఆదివాసీ ప్రాంతాల్లో తొలకరి జల్లులు పడినప్పటి నుంచి బతుకుబండి మొదలవుతుంది. ఈ కార్యక్రమాన్ని వారు చాలా ఘనంగా జరుపుకుంటారు. గూడెంలోని ప్రజలంతా ఓ చోట చేరి ప్రతి ఇంటి జొన్నలు, కొర్రలు, బియ్యం, ఇప్పసారా తీసుకొచ్చి ఓ చోట పెట్టి పూజలు చేస్తారు. ఆ తర్వాత వాటిని వండుకుని అందరూ అక్కడే భోజనాలు చేస్తారు. ఆడా, మగ అందరూ ఇప్పపువ్వు సారా తాగుతారు.

తొలకరి జల్లు కురిసినప్పటి నుంచే మేము పనులు మొదలు పెట్టుకుంటాం. ఆ రోజు మాకు అందరికీ చాలా ప్రత్యేకం. అందరం కలిసి పూజలు చేసి, వంటలు చేసుకుంటాం. వాన పడితేనే మాకు పంట పండుద్ది. అడవిలో ప్రతి భాగము మాకు దైవ సమానమే. పండుగ రెండో రోజు నుంచి వేట మొదలు పెడతారు. ఏ కార్యక్రమమైనా ఒక నియమం ప్రకారం నిర్వహించుకుంటాం. గూడెం పెద్ద.

తొలకరిలో ప్రత్యేక పూజలు
తొలకరిలో ప్రత్యేక పూజలు

పండుగ రెండో రోజు నుంచి గూడెంలోని పురుషులంతా వేటకు బయలుదేరతారు. అంతా కలిసి పక్షులను, జంతువులను వేటాడుకొస్తారు. వేట మాంసాన్ని అన్ని కుటుంబాల వారు పంచుకుంటారు. గ్రామ దేవతలకు నైవేద్యం సమర్పించిన తర్వాత వండుకుని తింటారు. కోయ స్త్రీలు నేల మీదే ప్రసవిస్తారు. మంత్రసాని పురుడు పోస్తుంది. పుట్టిన వెంటనే పసికందులకు కలి చల్లుతారు. దొండాకు పసరు పోస్తారు.

వేట ప్రధాన జీవనాధారం
వేట ప్రధాన జీవనాధారం

వ్యవసాయం ఎలా చేస్తారంటే..

గిరిజన ప్రాంతాల్లో పశువులను సంపదగానే చూస్తారు. పశువులకు పాలు తియ్యరు. బర్రెలు, ఎద్దులతో దుక్కి దున్నుతారు. కొన్ని కుటుంబాల్లో ఎంతమంది మగపిల్లలుంటే అన్ని నాగళ్లు ఉంటాయి. ఏరోజు ఇంటి వద్ద ఎవ్వరూ ఉండరు. వేకువనే పొలం పనులు.. రాత్రి వేళ వేట.. వారంలో సంత ఇదే వారి జీవన చక్రం. అడవుల్లోను, కొండ వాలు ప్రాంతాల్లో దుక్కి దున్ని పంటలు వేస్తారు. వర్షాధారంగా సాగు చేస్తారు. ఇక్కడి పొలాలు ఎగుడుదిగుడుగా చిన్న చిన్న మడులుగా ఉంటాయి.

మహిళలకు ఇవే ఉపాధి
మహిళలకు ఇదే ఉపాధి

ఇదీ చూడండి: గిరిజనులు మనుషులు కాదా...?

ఆహార, ఆదాాయ మార్గాలు ఇవే...

కొండ వాలు ప్రాంతాల్లో పండించే తిండి గింజలే వారికి ఆహారం, ఇక్కడ సజ్జలు, రాగులు, వరి పండిస్తారు. కేవలం సేంద్రియ ఎరువులతోనే సాగు చేస్తారు. ఇవికాక మన్యంలో దొరికే చింతపండు, సీతాఫలాలు, కుంకుడు కాయలు, తేనె, ఇతర పండ్లు, వారపు సంతల్లో విక్రయించి తమకు కావాల్సిన నిత్యావసర సరుకులు కొనుక్కుంటారు.

ఇప్పుపువ్వుతో నూనె, సారా తీస్తుంటారు
ఇప్పుపువ్వుతో నూనె, సారా తీస్తుంటారు

ఇప్పు పువ్వు సీజన్​ వచ్చిందంటే ఖాళీగా ఉండరు. సాధారణంగా ఇప్పపువ్వు తెల్లవారు సమయంలో పడుతుంది. అందువల్లే వేకువనే వెళ్లి పువ్వును సేకరిస్తారు. దానిని ఎండబెట్టి సంతల్లో అమ్ముతారు. దానినుంచి నూనె, సారా తీస్తుంటారు. దీనితో పాటు జీలుగు కల్లును విక్రయిస్తుంటారు. అడవిలో దొరికే తునికి పండ్లు, పుట్టగొడుగులు, దుంపలు ఆహారంగా ఉపయోగిస్తారు. ఎండాకాలంలో అడవిలోని చెట్ల నుంచి సేకరించిన ఎర్రచీమల గుడ్లను ఆహారంగా తీసుకుంటారు.

కొర్ర అన్నం
కొర్ర అన్నం

తెల్లవారుజామునే ఆడవాళ్లు, పిల్లలు వెళ్లి ఇప్పపువ్వును సేకరిస్తాం. వాటిని ఎండబెట్టి సంతల్లో అమ్ముకుంటాం. దాని నుంచి సారా కూడా తీస్తాం. వేడుకలు, ఇతర సమయాల్లో ఆడా, మగ అందరూ కలిసి తాగుతాం. దీనితో పాటు జీలుగు కల్లు కూడా ఉంటుంది. ఇవికాక కొండల్లో చాలా మామిడి చెట్లు ఉంటాయి. పండ్లతో తాండ్రను తయారు చేస్తుంటాం. పసన, అనాస, సీతాఫలం, చాలా ఎక్కువ దొరుకుతాయి. వాటిని అమ్ముకుని ఇంట్లోకి కావాల్సినవి కొనుక్కుంటామంటుంది గిరిజన మహిళ తుంబ్రి.

వస్త్ర, వేషధారణ

కోయతెగలో మహిళలు సౌందర్యానికి ప్రాధాన్యతనిస్తారు. వేడుకలు, వివాహాల సమయంలో ప్రత్యేక అలంకరణ చేసుకుంటారు. పెళ్లి సమయంలో వరుడు దుక్కితున్నుతుంటే వధువు విత్తునాటుతుంది. ఇప్పటికీ ఈ సంప్రదాయాన్ని పాటిస్తారు. సాధారణ సమయాల్లో వీరి వస్త్రధారణ అడ్డకట్టు అంటారు. కొప్పును ఓ పక్కగా ముడివేస్తారు. వీరి నివాసాలను గుంపులు అంటారు.

ఈ నూనెను వంటకు ఉపయోగిస్తారు
ఈ నూనెను వంటకు ఉపయోగిస్తారు

వివాహాలు

ఇంటిపేరు, గట్టుద్వారా వరస అయినవాళ్లతో సంబంధం కలుపుకుంటారు. సంబంధం నచ్చితేనే భోజనం పెడతారు. వరుడికి పేరంటాలు పసుపు, కుంకుమ, నలుగు పెడతారు. ఈ తతంగాన్ని ఊరింద అంటారు. పెళ్లికి వస్తున్నామని చెప్పడానికి జోడాలను పంపిస్తారు. దారిలో కాళ్లతీపుల కల్లు తాగుతారు. వివాహ సమయంలో అవిరేని కుండలు, ఎదుర్కోలు, సహా అన్ని సాధారణ సంప్రదాయాలే ఉంటాయి. వీటన్నింటికీ మించి డీజే పాటలు లేకుండా పెళ్లి జరగదనేది వాస్తవం.

ఇదీ చూడండి: గిరిపుత్రుల సంకల్పం... చందాలు వేసుకుని శ్రమదానంతో రహదారులు

ఎక్కడికైనా నడకే

వేకువజామునే ఉపాధి వేట
వేకువజామునే ఉపాధి వేట

మన్యంలో చాలా గూడెం ప్రాంతాలకు రహదారులు లేవు. మైళ్ల దూరం ఎగుడుదిగుడు ప్రాంతాల్లో నడకే ఆధారం. వర్షాకాలంలో వాగులు పొంగి చాలా ప్రాంతాలతో సంబంధాలు తెగిపోతుంటాయి. ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చిందంటే జట్టీలు కట్టుకుని మోసుకొస్తుంటారు. మన్యంలో ఉన్న చెట్ల సంఖ్య కంటే అక్కడి ప్రజలకు ఎక్కువ సమస్యలు ఉన్నాయి. కాని తమకొచ్చిన కష్టాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. స్థానిక అధికారులుకు, ప్రజాప్రతినిధులుకు ఎన్నిసార్లు గోడు విన్నవించుకున్నా వారి గోడు అరణ్య రోదనగానే మిగులుతోంది. ఓటుకార్డులు, ఆధార్​ కార్డులు సహా ఏ గుర్తింపు లేని గిరిపుత్రులు ఎందరో ఉన్నారు. చుట్టూ ఉన్న మన్యం రోజురోజుకు కరిగిపోతున్నా... వారి సమస్యలు పెరిగిపోతూనే ఉన్నాయి.

ఇదీ చూడండి: గిరిపుత్రుల సంకల్పం... గ్రామానికి సొంతంగా రహదారి

Last Updated : Jul 8, 2021, 3:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.