భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో గిరిజన ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో జరిగే సర్ ప్లస్ ఉపాధ్యాయుల కౌన్సిలింగ్ను ఆపివేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. పాఠశాలల్లో తక్కువ విద్యార్థులు ఉన్నచోట ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉన్నవారిని వేరే చోటకు బదిలీ చేయాలని ఐటీడీఏ పీవోవీపీ గౌతమ్ సూచించారు. విద్యా సంవత్సరం మధ్యలో కౌన్సిలింగ్ నిర్వహించి బదిలీలు చేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని ఉపాధ్యాయులు వాపోయారు. ఎస్జీటీ ఉపాధ్యాయుల కౌన్సిలింగ్ను వాయిదా వేయాలని కోరారు.
ఇవీచూడండి: 'ఉగ్రవాదాన్ని ఆయుధంగా మలుచుకుంటున్న పాక్'