భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం పైడి గూడెం సమీపంలో పోడు భూముల విషయంలో అటవీశాఖ సిబ్బందికి, ఆదివాసీలకు మధ్య తీవ్ర వివాదం జరిగింది. కొద్ది రోజుల నుంచి అటవీశాఖ అధికారులు హరితహారం కోసం ఇతర అభివృద్ధి పనులు చేపట్టడానికి యంత్రాల సహాయంతో భూమిని చదును చేసే పనులు చేయిస్తున్నారు. దీంతో ఆదివాసీలు అటవీశాఖ సిబ్బందిని అడ్డుకున్నారు. జేసేబీ వాహనాల ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
ఆదివాసుల ఆందోళనతో ఇరువర్గాల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. అటవీ శాఖకు చెందిన భూములను గిరిజనులు ఆక్రమించుకోవడం చట్టరీత్యా నేరమని అధికారులు ఎంత నచ్చజెప్పినా వారు వినిపించుకోలేదు. ఎన్నో సంవత్సరాల నుంచి పోడు భూములు సాగు చేసుకుంటూ జీవిస్తున్నామని తెలిపారు. అటవీశాఖ అధికారులు తమ భూములను దౌర్జన్యంగా లాక్కున్నారని వారు ఆరోపిస్తున్నారు. కొంతమంది ఆదివాసీలను అదుపులోకి తీసుకొని దుమ్ముగూడెం అటవీశాఖ కార్యాలయానికి తరలించారు
ఇదీ చూడండి: పోడు భూములపై అటవీశాఖ అధికారుల దౌర్జన్యం.. లాక్కొవద్దని గిరిజనుల ఆవేదన