పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులకు ప్రభుత్వం పట్టాదారు పాసుపుస్తకాలివ్వాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో ఆదివాసీ సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తహసీల్దార్‌కు వినతి పత్రాన్ని సమర్పించారు.
జిల్లాలోని సూరారం, నల్లబోడు బండ గ్రామాల పరిధిలోని సీలింగ్ భూములను ప్రభుత్వం గిరిజనులకు పంపిణీ చేయాలని ఆదివాసి సంఘం నేతలు డిమాండ్ చేశారు. పోడు భూములను సాగు చేస్తున్న గిరిజనులకు వెంటనే పట్టాలు ఇవ్వాలని కోరారు. లేని పక్షంలో ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: 14 రోజుల్లో సంచలన విషయాలు వెల్లడిస్తా: మల్లాడి కృష్ణారావు