ETV Bharat / state

ప్రాజెక్టుల పేరుతో నిధుల దుర్వినియోగం: ప్రొ. కోదండరాం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో తెజస అధ్యక్షుడు ప్రొఫెసర్​ కోదండరాం పర్యటించారు. త్వరలో జరగనున్న ఖమ్మం నల్గొండ వరంగల్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో భాగంగా ప్రచారం నిర్వహించారు. పాలకులను మార్చితే తప్ప ప్రభుత్వ పరిస్థితి చక్కబడదన్నారు. ప్రజలంతా ఆలోచించి ఓటు వేయాలని కోదండరాం సూచించారు.

tjs leader kodandaram mlc campaign in bhadradri district

author img

By

Published : Feb 2, 2021, 10:02 PM IST

ప్రాజెక్టుల పేరుతో కార్పొరేటర్​లకు, గుత్తేదారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాభం చేకూరుస్తున్నాయే తప్ప ప్రజలకు కాదని తెజస అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. త్వరలో జరగనున్న ఖమ్మం - నల్గొండ - వరంగల్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో భాగంగా... భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించారు. ఉపాధ్యాయులు, న్యాయవాదులు, ఆదివాసీ సంఘాల నాయకులను కలిసి తమకు ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు.

ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వాలు నిధులను దుర్వినియోగం చేస్తున్నాయని ఆరోపించారు. ఉద్యోగ సంఘాలకు జీతాలు కోతలు విధిస్తున్నారని... పీఆర్సీ కూడా పెంచే పరిస్థితుల్లో లేరని వివరించారు. ప్రభుత్వాల అధికార దుర్వినియోగం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ పరిస్థితులు మారాలంటే ప్రజల్లో మార్పు రావాలని... పాలకులను మార్చితే తప్ప ప్రభుత్వ పరిస్థితి చక్కబడదన్నారు. ప్రజలంతా ఆలోచించి ఓటు వేయాలని కోదండరాం సూచించారు.

ఇదీ చూడండి: మరణం కమ్మేసినా.. మరొకరిలో మళ్లీ బతికాడు.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.