భద్రాద్రి రామయ్య సన్నిధిలో బ్రహ్మోత్సవాలు నిరాడంబరంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం తెప్పోత్సవం, దొంగలదోపు ఉత్సవం నిర్వహించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా భక్తులు ఎవరూ లేకుండా ఆలయం లోపలే ఈ ఉత్సవాన్ని జరిపించారు.
ఏటా లక్ష్మణ సమేత సీతారాములను గోదావరి నది వద్దకు తీసుకెళ్లి గోదావరి నదిలో తెప్పోత్సవం నిర్వహించేవారు. అనంతరం స్వామివారిని తిరువీధి సేవకు తీసుకెళ్లి.. తాతగుడి సెంటర్లో భక్తుల సందడి నడుమ దొంగలదోపు ఉత్సవాన్ని నిర్వహించేవారు. కరోనా కారణంగా ఈ సంవత్సరం ఉత్సవాలను నిరాడంబరంగా నిర్వహించారు.