ETV Bharat / state

ఎంపీటీసీ ఆచూకీపై కొనసాగుతున్న ఉత్కంఠ - తెరాస

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంచలనం రేపిన తెరాస నాయకుడు, ఎంపీటీసీ నల్లూరి శ్రీనివాసరావు ఆచూకీపై ఉత్కంఠ కొనసాగుతోంది. నలుగురికి సాయం చేసే వ్యక్తే తప్ప ఎవరికి కీడు చేయడని కుటుంబసభ్యులు అంటున్నారు.

ఎంపీటీసీ ఆచూకీపై కొనసాగుతున్న ఉత్కంఠ
author img

By

Published : Jul 11, 2019, 6:02 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంచలనం రేపిన తెరాస నాయకుడు, ఎంపీటీసీ నల్లూరి శ్రీనివాసరావును క్షేమంగా విడిచిపెట్టాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు. మావోయిస్టుల చేతిలో అపహరణకు గురైన శ్రీనివాసరావు... 3 రోజులుగా వారి చెరలోనే ఉన్నారు. ఆయన కుటుంబ సభ్యులు సోమవారం అర్ధరాత్రి జరిగిన సంఘటన గుర్తు చేసుకుని కన్నీరుమున్నీరవుతున్నారు. శ్రీనివాసరావు రాక కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. నలుగురికి సాయం చేసే గుణమే తప్ప... ఎవరికీ అన్యాయం చేయలేదని శ్రీనివాసరావు భార్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మావోయిస్టులు తన తండ్రిని క్షేమంగా వదిలేయాలని ఆయన కొడుకు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాడు. శ్రీనివాసరావు కుటుంబసభ్యులతో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి...

కొనసాగుతున్న ఉత్కంఠ

ఇవీ చూడండి: చెరువులో టిక్​టాక్​ చేస్తూ యువకుని మృతి​

Intro:మహబూబ్ నగర్ జిల్లా,అడ్డాకుల మండల కేంద్రాన్ని సందర్శించిన త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి.

Body:మహబూబ్ నగర్ జిల్లా,అడ్డాకుల మండల కేంద్రాన్ని సందర్శించిన త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి. అడ్డాకుల మండల కేంద్రంలోని వివేకానంద విగ్రహం నుంచి శివాలయం గుడివరకు భజనలతో, సంకీర్తనలతో ర్యాలీ తీయడం జరిగింది. దేవాలయ ఆవరణలో స్వామి వారు మానవ మనుగడ గురించి తెలియజేశారు . మానవులు తమ ఆరోగ్యంపట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. మనం తీసుకునే ఆహారపు అలవాట్లు మన జీవితాన్ని ప్రతిబింబిస్తాయని తెలిపారు. ఫాస్ట్ ఫుడ్స్, మైదా పిండి తో తయారు చేసినటువంటి ఆహారాన్ని తినడం వల్ల క్యాన్సర్ లాంటి వ్యాధులు సంక్రమిస్తాయని తెలిపారు. వ్యాధులు వచ్చాక మందులు వేసుకునే బదులు వ్యాధులు రాకుండా జాగ్రత్త వహించాలని తెలియజేశారు . మనం ఉపయోగించే వస్తువుల వలన ఓజోన్ పొరకు చిల్లులు పడి శక్తివంతమైన సూర్య కిరణాలు మన శరీరంపై పడడం వల్ల వివిధ రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తెలియజేశారు .కావున సమస్త జీవరాశి మనుగడకు అవసరమయ్యేటటువంటి వాత వరణాన్ని కలుషితం చేయకుండా కాపాడాల్సిన బాధ్యత మనసులో ఉందని తెలియ చేశారు. గాలి ,నీరు, తినే ఆహార పదార్థాలు వంటి వాటిని కలుషితం చేయకుండా పర్యావరణాన్ని పరిరక్షించాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి యొక్క ప్రవచనాలను భక్తిశ్రద్ధలతో విన్నారు.

Conclusion:కిట్ నెంబర్ 1269
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.