లాక్‌డౌన్ వల్ల ఖమ్మం కమిషనరేట్ పరిధితోపాటు భద్రాద్రి జిల్లాలోనూ నేర తీవ్రత రోజుల వ్యవధిలో తగ్గిపోయింది. నెల రోజుల వ్యవధిలో నేరాల, ఘోరాల సంఖ్యను గతేడాది ఈ రోజులతో పోల్చిచూసినట్టయితే మార్పు స్పష్టంగా కనిపిస్తుంది.
భద్రాద్రి జిల్లాలో పరిస్థితి ఇదీ...
* చిల్లర దొంగతనాలు 21.42 శాతానికి పరిమితమయ్యాయి.
* పగటి దొంగతనాలు లేవు. రాత్రి దొంగతనాలు ఒకటి పెరిగాయి.
* హత్యలు అపుడు, ఇపుడూ ఏమీలేవు.
* కిడ్నాప్‌లు శూన్యం.
* అత్యాచారాలు 25 శాతానికే పరిమితమయ్యాయి.
* చిన్నపాటి ఘర్షణలు, చీటింగ్‌లు తగ్గుముఖం పట్టాయి.
* రోడ్డు ప్రమాదాలు 26.66 శాతానికి పరిమితమయ్యాయి.
* రోడ్డు ప్రమాద క్షతగాత్రులు 31.57 శాతం నమోదయ్యాయి.
* మిస్సింగ్ కేసులు 81.25 శాతంగా గుర్తించారు.
ఖమ్మం కమిషనరేట్ పరిధిలో తగ్గిన నేరాలు
* పగటి దొంగతనాల ఊసేలేదు.
* రాత్రి దొంగతనాలు 41.66 శాతానికి పరిమితమయ్యాయి.
* కిడ్నాప్‌లు తగ్గాయి. కేవలం 27.27 శాతానికే పరిమితం అయ్యాయి.
* అత్యాచారాలు తగ్గిపోయాయి.
* మోసపూరిత ఘటనల సంఖ్య గణనీయంగా తగ్గగా, చిన్నపాటి ఘర్షణలు తగ్గుముఖం పట్టాయి.
* 17.30 శాతానికి రోడ్డు ప్రమాదాలు పరిమితం కాగా మృతుల శాతం 41.17 శాతానికి పరిమితమైంది.
* మిస్సింగ్ కేసులు 33.33 శాతానికి తగ్గిపోయాయి.
వీరిని ఏమనాలో..?
లాక్‌డౌన్ నేపథ్యంలో ఎటు చూసినా రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. మందులు, ఆసుపత్రి చికిత్సల కోసం బయటకు వచ్చేవారు కొద్ది సంఖ్యలోనే ఉంటున్నారు. అవసరంగా లేకున్నా కొందరు అదే పనిగా రోడ్డెక్కుతున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలు కొద్ది సంఖ్యలో జరుగుతున్నాయి. ఖమ్మం కమిషనరేట్ పరిధిలో నెల రోజుల్లో 12 ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. లాక్‌డౌన్ సమయంలో ప్రమాదాలకు గురయ్యారంటే చోదక తీరు చెప్పాల్సిన పనిలేదు.