భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో పల్స్ పోలియో చుక్కల కేంద్రాలను మున్సిపల్ ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు, డాక్టర్ వరుణ్‌తో కలిసి ప్రారంభించారు. పట్టణంలోని 24 వార్డులతో పాటు కొత్త బస్టాండ్, జేకే బస్టాప్, జగదాంబ ప్రధాన సెంటర్లలో పోలియో చుక్కలు వేసేలా కేంద్రాలు ఏర్పాట్లు చేసినట్లు వైద్యుడు వరుణ్ వెల్లడించారు. ఇల్లందులోని పలు కేంద్రాలలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని వారు పరిశీలించారు.
