ETV Bharat / state

నీటి కనెక్షన్ లేక దశాబ్దాలుగా దివ్యాంగ దంపతుల అవస్థలు

ఆ భార్యాభర్తలు దివ్యాంగులు. ఓ వైపు కొవిడ్.. మరో వైపు ఉపాధిలేమి వారిని కష్టాల్లో పడేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన వీరికి దశాబ్దం నుంచి పంపు కనెక్షన్ లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నారు.

disable family suffering with problems
దివ్యాంగ దంపతుల కుటుంబం
author img

By

Published : Apr 18, 2021, 9:08 AM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దివ్యాంగ దంపతులు నీటి కనెక్షన్ లేక దశాబ్ధాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇల్లందు పట్టణం 17వ వార్డులో నివాసముంటున్న ఇసాక్-యశోద దంపతులు వికలాంగులు. వారికి ముగ్గురు కుమార్తెలు. కుర్చీలు అల్లకం, షామియానాలు వేసే టెంట్లు కుట్టడం వంటి పనులు చేసేవాడు. భర్తకు చేదోడుగా భార్య యశోద బుట్టలు అల్లుతుండేది. కరోనా వల్ల వారు ఉన్న ఉపాధిని కోల్పోయారు.

ఓ వైపు ఉపాధి కోల్పోయి బతుకుబండిని లాగడమే కష్టంగా మారిందంటే.. మరోవైపు దశాబ్ద కాలంగా వేధిస్తున్న నీటి సమస్య మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంగా మారింది. ఇంటికి నల్లా కనెక్షన్ లేక దూర ప్రాంతం నుంచి మోసుకు రావాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా.. ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు.

ఇంటి నెంబరు లేని కారణంగా..

ఇంటి నెంబరు లేని కారణంగా పంపు కనెక్షన్ రాక ఇబ్బందులు పడుతున్నామని ఇసాక్ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల రికార్డులో ఇంటి వివరాలు నమోదు చేశామని అధికారులు చెబుతున్నా సొంత పంపు కనెక్షన్ మాత్రం వారికి అందని ద్రాక్షగా మిగిలింది. బయటకు వెళ్లి తనకు వచ్చిన పనులు చేసుకుందామన్నా తనకు ఉన్న మూడు చక్రాల సైకిల్ మీద వెళ్లలేని పరిస్థితి... తమ కుటుంబానికి ప్రభుత్వం రెండు పడక గదుల ఇల్లు కేటాయించాలని ఇసాక్ కుమార్తెలు కోరుతున్నారు.

ఇదీ చదవండి : 'స్పష్టమైన వ్యాక్సినేషన్​ వ్యూహం అవసరం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.