భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు లక్ష్మణ సమేత సీతారాములకు అంగరంగవైభవంగా తెప్పోత్సవం నిర్వహిస్తున్నారు.
రాజ లాంఛనాలు, మేళ తాళల నడుమ ప్రత్యేకంగా రూపొందించిన హంస వాహనంపై లక్ష్మణ సమేత సీతారాములు పుష్కరిణికి చేరుకున్నారు. ప్రతి ఏడాది గోదావరి నదిలో నిర్వహించే తెప్పోత్సవం.. కరోనా కారణంగా ఈ ఏడు ఆలయ ఆవరణలోని పుష్కరిణిలో ఏర్పాటు చేశారు. ఆలయ అధికారులు, ఉద్యోగులు, పరిమిత సంఖ్యలో భక్తులతో వేదపండితులు తెప్పోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
- ఇదీ చూడండి : కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి మంత్రి కేటీఆర్ లేఖ