రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిరాడంబరంగా జరిగాయి. ఇల్లందులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద జాతీయ జెండా ఆవిష్కరించారు. జగదాంబ సెంటర్, మున్సిపల్ కార్యాలయాల్లో ప్రజా ప్రతినిధులు, తెరాస నాయకులు సంబరాలు చేసుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద భద్రాద్రి జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు హరిసింగ్ నాయక్, మున్సిపల్ ఛైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు పూలమాలలతో అమరవీరులకు నివాళి అర్పించారు.
వాడవాడలో జెండా ఆవిష్కరణ
అనంతరం మున్సిపల్ కార్యాలయంలోని జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి, జెండా ఆవిష్కరించారు. పారిశుద్ధ్య కార్మికుడు రామ్ చందర్ గీసిన కేసీఆర్ చిత్రపటాన్ని తెరాస నాయకులు ఆవిష్కరించారు. తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మార్వో మస్తాన్ రావు జెండా ఆవిష్కరించారు. సింగరేణి కార్యాలయంలో జరిగిన ఆవిర్భావ వేడుకల్లో ఏరియా జనరల్ మేనేజర్ సత్యనారాయణ పాల్గొన్నారు.
ఇదీ చూడండి: సీఎం కేసీఆర్‌కి రైతన్న బహుమానం