ETV Bharat / state

Telangana Rain Alert 2023 : తెలంగాణకు అలర్ట్.. రానున్న రెండ్రోజులు అతిభారీ వర్షాలు - Telangana Rains today

Telangana Rain Alert 2023 : రాష్ట్రంలో రాగల రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలో ఉంటుందని వెల్లడించింది.

Rains
Rains in The State in The Two Days
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 15, 2023, 1:45 PM IST

Telangana Rain Alert 2023 : రాష్ట్రంలో ఇవాళ, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత తీవ్రంగా బలపడిందని పేర్కొంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం నైరుతి వైపు వాలి వచ్చే రెండు రోజుల్లో ఒడిశా, ఛత్తీస్​గఢ్​ మీదుగా కదిలే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర, తూర్పు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ముఖ్యంగా ఆదిలాబాద్​, కుమురంభీం ఆసిఫాబాద్​, మంచిర్యాల, నిర్మల్​, నిజామాబాద్​ జిల్లాల్లో దీని ప్రభావం అధికంగా ఉంటుందని పేర్కొంది.

Flood Water Flowing in Chinthal : నీటమునిగిన చింతల్.. ఇళ్లలోకి చేరిన వరద నీరు

Godavari Water Level At Bhadrachalam Today : రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు పలు ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. వాగులు, చెరువుల్లో జలకళ సంతరించుకుంది. గురువారం కురిసిన వర్షానికి ఎగువ నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం (Godavari Water Level Today) క్రమ క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు గోదావరి నీటిమట్టం 33 అడుగులు దాటి ప్రవహిస్తోంది. భద్రాచలం ఎగువ ప్రాంతాల్లో ఉన్న తాలిపేరు నుంచి 50 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.

సమక్క సారక్క బ్యారేజ్​ నుంచి 3 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని కూడా దిగువకు విడుదల చేయడంతో భద్రచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీరు వల్ల భద్రచలం వద్ద ఇంకా మూడు అడుగుల వరకు నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. నీటిమట్టం పెరగడంతో గోదావరి వరద భద్రాచలం వద్ద స్నాన ఘట్టాల వరకు నీరు చేరుకుంది.

Huge Traffic in Hyderabad Rains : వరుణ్ బ్రో కొంచెం గ్యాప్​ తీసుకో.. ఈ ట్రాఫిక్​లో ఇళ్లు చేరేదెలా..?

Hyderabad Rains 2023 : మరోవైపు రాష్ట్రంలో బుధవారం రాత్రి నుంతి గురువారం వరకు వర్షాలు కురిశాయి. అత్యధికంగా మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలో 15.1 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. అదే జిల్లా కన్నేపల్లిలో 12.2, ఆసిఫాబాద్​ జిల్లా పెంచికలపేట 11.9, దహేగాం 11.2, భూపాలపల్లి జిల్లా పలిమెల 10.8, మహదేవ్​పూర్​ 10, ములుగు జిల్లా వాజేడు 8.8. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్​ మండలంలో 7.7 సెం.మీటర్ల వర్షం కురిసింది. హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో గురువారం భారీ వర్షాలు పడ్డాయి. దీంతో రోడ్లపై నీరు ఉండడంతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. ఉత్తర, తూర్పు జిల్లాల్లోనూ ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.

Farmer Stuck in Flood Water : ఆకస్మాత్తుగా వరద.. గేదెల కోసం వెళ్లి వాగులో చిక్కుకున్న రైతు

Telangana Flood 2023 : వరద వచ్చి.. విధ్వంసం సృష్టించింది.. ఆదుకునేదెవరు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.