భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని సీపీఎం కార్యాలయంలో తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ రాష్ట్ర రెండో మహాసభలు జరుగుతున్నాయి. నేడు, రేపు జరగనున్న ఈ మహాసభలకు మహిళా కార్మికులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
కొన్నేళ్లుగా మహిళా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్య పట్ల మహాసభల్లో చర్చించుకుని ప్రభుత్వంతో పోరాటం చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు నాయకులు తెలిపారు. ఈ సభలో యూనియన్ రాష్ట్ర సీనియర్ నాయకురాలు మౌనమ్మ, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు, సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: గచ్చిబౌలి బయోడైవర్సిటీ వద్ద ప్రమాదం