భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలో రేగా కాంతారావు ఉపాధి హామీ కూలీలకు, స్థానిక ప్రజలకు బత్తాయి పండ్లు పంపిణీ చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలకు పంపిణీ చేసేందుకు 200 క్వింటాళ్ల బత్తాయి పండ్లు కొనుగోలు చేసినట్లు తెలిపారు. ప్రజల్లో రోగనిరోధక శక్తి పెరిగి కరోనా వైరస్ని అరికట్టేందుకు ఈ పండ్లు దోహదం చేస్తాయని స్పష్టం చేశారు. భౌతికదూరం పాటించటం వల్ల కరోనా వైరస్ను నిర్మూలించవచ్చునని తెలిపారు.
'కరోనాపై పోరులో ప్రజలదే పైచేయి' - ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
కరోనాపై పోరులో రాష్ట్ర ప్రజలదే పైచేయిగా నిలవనుందని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పేద ప్రజలకు బత్తాయి పండ్లను పంపిణీ చేశారు.
కరోనాపై పోరులో ప్రజలదే పైచేయి