భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఏజెన్సీ ప్రాంతంలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబూరావు పర్యటించారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలనే డిమాండ్‌తో పోరాటం చేస్తున్నామని ఎంపీ సోయం అన్నారు. దిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టేందుకు గిరిజనులతో సమావేశ మవుతున్నామని తెలిపారు.
లంబాడీలకు ఏజన్సీ సర్టిఫికెట్లు ఇవ్వరాదని ఉద్యమం చేస్తున్నానని అన్నారు. కానీ తెరాస ప్రభుత్వం గిరిజనులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందన్నారు. భద్రాచలంలోని అంత్యోదయ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, గిరిజన సంఘాల నాయకులు హాజరయ్యారు.
ఇదీ చూడండి : 'కేసీఆర్ తాతా... మమ్మీవాళ్లను చర్చలకు పిలవండి'