Lord Rama of Bhadrachalam: భద్రాద్రి రామయ్య కల్యాణానికి గోటితో ఒలిచే తలంబ్రాలు సమర్పించే భాగ్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా చీరాలలోని శ్రీరఘురామ భక్త సేవా సమితి దక్కించుకుంది. శ్రీరామనవమి రోజున సీతారామ కళ్యాణానికి ఉపయోగించే తరంబ్రాలను గోటితో వలిచి తలంబ్రాలుగా తీర్చిదిద్దే అవకాశాన్ని వరుసగా ఎనిమిదోసారి సేవా సమితి దక్కించుకుంది. గత ఐదు రోజుల నుంచి గోటితో వడ్లు వలిచే ప్రక్రియ ప్రారంభించారు. ఈ క్రతువు భద్రాచలంలో తలంబ్రాలు సమర్పించటంతో ముగియనుంది.
11 మందితో ఏర్పడి
Lord Rama of Bhadrachalam: చీరాలకు చెందిన శ్రీరఘురామ భక్త సేవా సమితి 2011లో 11 మంది సభ్యులతో ఏర్పాటైంది. 2013లో శ్రీరామ నవమి వేడుకలకు తలంబ్రాలు సమర్పించేందుకు భద్రాచలం దేవస్థానం నుంచి అనుమతి పొందారు. అప్పటినుంచి భద్రాచలానికి గోటితో ఒలిచిన తలంబ్రాలను పంపుతున్నారు. ఈ క్రతువు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు దిల్లీ, బెంగుళూరు, చెన్నై, ఒడిశా మొదలుకుని.. అమెరికా, దక్షణాఫ్రికా, కెనడా, తదితర ప్రాంతాల్లో జరగుతుంది. 50 మంది పర్యవేక్షకుల మధ్య పది వేలకు పైగా భక్తులు పాల్గొంటున్నారు. కమిటీ ప్రతినిధులు దేశవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల సహాయంతో రామ భక్తులకు ఈ వడ్లను పంపిస్తారు. వారు ఒలవడం పూర్తి చేసి వాటిని పర్యవేక్షకుల వద్దకు కొరియర్ల ద్వారా చేరుస్తారు.
మొత్తం క్రతువుకు 15 వేల కిలోల బియ్యం
Lord Rama of Bhadrachalam: శీరాముడి కల్యాణ క్రతువుకు మొత్తం 15 వేల కిలోల బియ్యం అవసరం కానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఏప్రిల్ 10వ తేదీ శ్రీరామ నవమి పర్వదినం. మార్చి 26వ తేదీ వరకు గోటితో ఒడ్లను ఒలిచి 27వ తేదీన మూటలు కడతారు. సుమారు 30 కింట్వాళ్ల బియ్యాన్ని పసుపు ఇతర సుగంధద్రవ్యాలతో కలుపుతారు. అన్నింటినీ అదేరోజు భద్రాచలానికి పంపిస్తారు. పసుపు 250 కిలోలు, కుంకుమ 500 కిలోలు, నూనె, నెయ్యిని భద్రాచలానికి పంపుతామని నిర్వాహకులు పొత్తూరి బాలకేశవులు తెలిపారు.
ఇదీ చూడండి: భద్రాద్రి బ్రహ్మోత్సవాలకు తేదీలు ఖరారు.. ఈసారి భక్తుల మధ్యే రాములోరి కల్యాణం