Srinivas Rao was killed by Guthikoyas: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అటవీ శాఖ అధికారి హత్య కేసులో ఏం చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. సర్వోన్నత న్యాయస్థానం న్యాయ సలహాదారు అమికస్ క్యూరీ దాఖలు చేసిన పిటిషన్‌కు మూడు వారాల్లో సమాధానం చెప్పాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. చండ్రుగొండ మండలంలో ఇటీవల జరిగిన ఘర్షణలో ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాసరావును గొత్తికోయలు హత్య చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఏడీఎన్ రావు రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ జరిపిన జస్టిస్ గవాయ్, జస్టిస్ విక్రమ్‌నాథ్‌ల ధర్మాసనం.. తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. మొత్తం ఘటనపై అధ్యయనం చేసి.. నివేదిక అందించాలని ఎన్విరాన్‌మెంటల్ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని ఆదేశించింది. పోడు భూముల వ్యవహారంలో శ్రీనివాసరావును హత్యచేయగా.. పత్రికల్లో వచ్చిన కథనాలను క్యూరీ సుమోటోగా తీసుకుని.. రిట్ పిటషన్ దాఖలు చేశారు. 2009లో మహిళా అటవీ అధికారిపై దాడి ఘటనపైనా తీసుకున్న చర్యలను అధ్యయనం చేసిన నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
ఇవీ చదవండి: