భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని ఆమ్బజార్, రెండోనెంబర్ బస్తీ ప్రాంతాల్లో వీధికుక్కలు స్వైర విహారం చేశాయి. పది మందికి పైగా వ్యక్తులను గాయపరిచాయి. వృద్ధులను రక్తం కారేలా కొరికాయి.
గాయపడిన పలువురు బాధితులు ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం క్యూ కట్టారు. ఈవిషయమై అధికారులకు పలుమార్లు విన్నవించినా ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు. ఇకనైనా తమకు ఈ కుక్కల బెదడను తప్పించాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: కుక్కల దాడిలో 33 గొర్రెలు మృతి.. రూ.3లక్షల నష్టం