ఏకాంతంగా భద్రాద్రి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు జరగనున్నాయి. భక్తులు లేకుండా భద్రాద్రిలో శ్రీరామనవమి వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 21 న శ్రీరామనవమి సందర్భంగా రామయ్య కల్యాణం ఉండగా... ఈనెల 22న భద్రాద్రి రామయ్య మహాపట్టాభిషేకం జరపనున్నారు.
కొవిడ్ నిబంధనలతో బేడా మండపంలో ఉత్సవాల నిర్వహణ జరగనుంది. ఈనెల 21, 22న అన్నిరకాల దర్శనాలు రద్దైనట్లు ఈవో శివాజీ తెలిపారు. గతేడాది కూడా కరోనా కారణంగా ఏకాంతంగానే భద్రాద్రి రామయ్య వేడుకలు జరిగాయి.