భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు వీరలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పంచామృతాలతో లక్ష్మీతాయారు అమ్మవారికి అభిషేకం నిర్వహించారు.
మహానివేదన భోగభాగ్యం అనంతరం సామూహిక లక్ష కుంకుమార్చన చేశారు. వీరలక్ష్మి అలంకారంలో అమ్మవారిని దర్శించుకోవడం వల్ల భయాలు తొలగి విజయం సిద్దిస్తుందని, ఆలయ అర్చకులు తెలిపారు. శంఖ, చక్రాలు, ధనుర్భాణాలు, కత్తి, డాలు, భరిశె ధరించి అష్ఠ హస్తాలతో అమ్మవారు కొలువుదీరారు.
ఇదీ చూడండి: తిరుమలలో శ్రీవారికి వైభవంగా చక్రస్నానం