భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో పునర్వసు నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. లక్ష్మణ సమేత సీతారాముల ఉత్సవ మూర్తులకు ప్రాకార మండపంలో అభిషేకం నిర్వహించారు. బంగారు కవచాలతో భక్తులను కనువిందు చేస్తున్నారు.
శ్రీ చక్ర సిమెంట్ అధినేత కృష్ణ మోహన్ ఆధ్వర్యంలో ప్రత్యేక భజన బృందాలు, సంగీత కళాకారులు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం రామయ్యను గోదావరి నది ఒడ్డున ఉన్న పునర్వసు మండపంలో ప్రత్యేక పూజలు చేస్తారు.
ఇవీచూడండి: భద్రాద్రి రామయ్యకు ఘనంగా స్నపన తిరుమంజనం