కరోనా తొలగిపోయి ప్రజలు ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని భద్రాద్రిలో అపదుద్ధారక స్త్రోత్ర పారాయణం జరుగుతోంది. 27 రోజులపాటు ఈ కార్యక్రమం జరగనుంది. 3వ రోజు కార్యక్రమంలో భాగంగా ప్రాకార మండపానికి స్వామివారిని తీసుకువచ్చి అపదుద్ధారక స్తోత్రం పఠించారు.
ఈ నెల 24న జ్యేష్ఠాభిషేకం సందర్భంగా.. కరోనాను రామచంద్రస్వామి పారదోలాలన్న సంకల్పంతో మహత్కార్యాన్ని చేపట్టినట్లు అర్చకులు తెలిపారు.