ETV Bharat / state

'టిక్​టాక్​ చెడే కాదు... మంచి కూడా చేస్తోంది'

టిక్​టాక్​ వీడియోల కోసం ఫీట్లు చేసి... ప్రాణాల మీదికి తెచ్చుకున్న ఘటనలు చూశాం... టిక్​టాక్​ వీడియోలు చేసి ఉద్యోగాలు పోగొట్టుకున్నవారినీ కూడా చూశాం. కానీ... రెండెళ్ల క్రితం తప్పిపోయిన తండ్రి.. ఉన్నాడో లేదో కూడా తెలియని వ్యక్తిని... టిక్​టాక్​ వీడియో కలిపింది. అదేంటో కింది కథనం చదివి తెలుసుకుందాం...

son who found missing father the tik tok video at badradri kothagudem
'టిక్​టాక్​ చెడే కాదు... మంచి కూడా చేస్తోంది'
author img

By

Published : May 24, 2020, 5:03 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం పినపాక పట్టినగర్​ గ్రామానికి చెందిన రొడ్డ వెంకటేశ్వర్లు పుట్టుకతోనే దివ్యాంగుడు. అతనికి భార్య, ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2018 ఏప్రిల్​ 27న కూలీ పనుల కోసం వెళ్లి అదృశ్యమయ్యాడు. కుటుంబసభ్యులు అన్ని చోట్ల వెతికిన జాడ దొరకలేదు. ఎన్ని రోజులు వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో బూర్గంపాడు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

ఆనాటి నుంచి పోలీసులు పలు ప్రాంతాల్లో వెతికినప్పటికీ... వెంకటేశ్వర్ల ఆచూకీ లభ్యం కాలేదు. ఈ నేపథ్యంలో పట్టి నగర్​ గ్రామానికి చెందిన నాగేంద్ర ప్రసాద్​.. టిక్​టాక్​ చూస్తుండగా.. తప్పిపోయిన వెంకటేశ్వర్లు అందులో కనిపించాడు. పంజాబ్​ లూథియానాలో ఎవరో వెంకటేశ్వర్లకు భోజనం పెడుతూ.. టిక్​ టాక్​ తీశారు. అది చూసిన నాగేంద్ర ప్రసాద్​.. వారి కుటుంబ సభ్యులకు టిక్​టాక్​... చూపించాడు.

పోలీస్​స్టేషన్​కు వెళ్లి టిక్​టాక్​ వీడియో చూపించారు. బూర్గంపాడు ఎస్సై బాలకృష్ణ సహకారంతో వెంకటేశ్వర్లను తీసుకువచ్చే ఏర్పాట్లు చేశారు. లాక్​డౌన్​ కారణంగా ఇతర రాష్ట్రాలకు వెళ్లడం కష్టం కావడం వల్ల జిల్లా ఎస్పీ సునీల్​దత్​ ప్రత్యేకంగా అనుమతినిస్తూ... ఒక పత్రాన్ని ఇచ్చారు. అక్కడి పోలీసులతో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేశారు. వీరు పంజాబ్​ వెళ్లేందుకు బూర్గంపాడు జడ్పీటీసీ శ్రీలత, ఎంపీటీసీ సరిత వాహనానికి నగదు సహాయం చేశారు.

లూథియానా పోలీసుల సహాయంతో తండ్రీకొడుకులు కలిశారు. టిక్​టాక్​ వీడియో తన తండ్రి ఆచూకీ తెలపడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.