Son Not Serve His Mother in Yellandu : ఏడుగురు సంతానంలో ఒక్కగానొక్క కుమారుడని గుండెల్లో పెట్టుకుని సాకినందుకు.. నేడు ఆ తల్లికి సపర్యలు చేసేందుకు వెనుకాడుతున్నాడు. తల్లి ఆలనాపాలనా చూడాల్సిన.. కడుపున పుట్టిన కుమారుడే కర్కశంగా వ్యవహరిస్తున్నాడు. గత కొన్నిరోజులుగా కుమార్తెల సంరక్షణలో ఉన్న ఆ వృద్ధురాలు.. నేడు కుమారుడి ఇంటి వద్దకు రావడంతో గేట్ బయటే ఉంచాడు ఆ ప్రబుద్ధుడు. ఇదేందని తోబుట్టువులు ప్రశ్నించడంతో వారితో వాగ్వాదానికి దిగాడు.
Mother's Day Special : అమ్మా నీకు సలాం.. పిల్లల ప్రేమ వదులుకొని.. తల్లి సేవకై తపించి..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు మండలం.. సుభాష్‌నగర్‌లో ఉండే రమేష్ అనే వ్యక్తి.. తన తల్లి తిలువేరు మల్లికాంబను ఇంటి నుంచి గెంటేశాడు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆ తల్లి.. కుమారుడి ఇంటి ముందు పడిగాపులు పడుతోంది. కన్నతల్లిపై సోదరుడి కర్కశ నిరాదరణను చూసిన తోబుట్టువులు.. సోదరుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Bhadradri Kothagudem District Latest News : వృద్ధాప్యంలో ఉన్న మల్లికాంబకు ఆరుగురు కూతుళ్లు.. ఒక కుమారుడు రమేష్ ఉన్నాడు. ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు చేసిన తర్వాత.. 30 సంవత్సరాల క్రితం భర్త చనిపోయాడు. మల్లికాంబనే చిన్న హోటల్ నిర్వహిస్తూ అందరినీ పోషించింది. అందరి బాగోగులు చూస్తూ పెద్ద చేసి.. మిగిలిన నలుగురు కుమార్తెలు, కుమారుడికి వివాహం చేసింది.
Mother Love: కన్నతల్లి ప్రేమ గెలిచింది.. పేగుబంధం నిలిచింది
మల్లికాంబకు రెండు సంవత్సరాల క్రితం పక్షవాతం వచ్చింది. వృద్ధాప్యంలో ఉన్న తన కన్నతల్లి బాగోగులను కుమారుడు పట్టించుకోకపోవడంతో.. పెద్ద మనుషుల ఒప్పందంతో కూతుళ్ల సంరక్షణలో ఉండే తల్లికి నెలకు 5000 రూపాయలు ఇవ్వమని సూచించారు. బోర్వెల్ వ్యాపారం చేసే తమ సోదరుడు తల్లిని పట్టించుకోవడంలేదంటూ కుమార్తెలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్య సమయంలో వచ్చిన మనస్పర్ధల కారణంగా తమతో కూడా మాట్లాడడం లేదని తెలిపారు.
తన కుటుంబ పరువు తీయడానికే.. తోబుట్టువులు వచ్చి గొడవ పెడుతున్నారని రమేష్ పేర్కొన్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. అక్కడికి చేరుకున్న వారు కుమారుడితో మాట్లాడి మల్లికాంబను ఇంట్లోకి చేర్చి సమస్యను పరిష్కరించారు.
"మల్లికాంబ మా అమ్మ. మేం ఏడుగురు సంతానం. బోర్వెల్ రమేష్ మా తమ్ముడు. రెండు సంవత్సరాల క్రితం మా అమ్మకు పక్షవాతం వచ్చింది. అప్పటి నుంచి రమేష్ కన్నతల్లి ఆలనాపాలనా చూడటం లేదు. గత కొన్ని రోజులుగా మా సంరక్షణలోనే ఉంది. ఈ రోజు మా అమ్మను ఇంటికి తీసుకురాగా గేట్ బయటే ఉంచాడు. తల్లి ఆలనాపాలనా చూడటానికి పెద్దమనుషుల సమక్షంలో ఒప్పందం జరిగింది. అయినా తల్లిని పట్టించుకోవడం లేదు" - ఉమాదేవి, వృద్ధురాలి కుమార్తె