భద్రాచలంలోని సబ్‌కలెక్టర్ కార్యాలయంలో తాచుపాము హల్చల్ చేసింది. ఆదివారం అయినా కూడా కార్యాలయ సిబ్బంది పని మీద కార్యాలయానికి వెళ్లగా పాము తారస పడింది. ఓ టేబుల్ కింద తిష్టవేయగా... దానిని చూసి సిబ్బంది భయబ్రాంతులకు లోనై పరుగులు తీశారు. రెండు గంటలపాటు శ్రమించి పట్టుకున్నారు. కార్యాలయ సిబ్బంది మొత్తం లేకపోవడం వల్ల ప్రమాదం తప్పిందని భావిస్తున్నారు.
ఇవీ చూడండి: వాగులో చిక్కుకున్న బస్సు... కాపాడిన స్థానికులు