ETV Bharat / state

Singareni Turnover: సింగరేణి రికార్డు.. మొదటి నాలుగు నెలల్లోనే రూ.800 కోట్ల లాభాలు - 8,180 కోట్ల టర్నోవర్‌

సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో అద్భుత వృద్దిని సాధించింది. కరోనా పరిస్థితులను అధిగమించి రూ.8,180 కోట్ల టర్నోవర్‌ సాధించి రికార్డు నెలకొల్పింది. గతేడాదితో పొలిస్తే 72 శాతం అధికమని సింగరేణి సీఎండీ శ్రీధర్‌ వివరించారు. ఈ ఏడాది 700 లక్షల టన్నుల వరకు బొగ్గు సరఫరాకు ప్రణాళికలు రూపొందించినట్లు ఆయన తెలిపారు.

Singareni Turnover
మొదటి నాలుగు నెలల్లోనే 800 కోట్ల లాభాలు
author img

By

Published : Aug 5, 2021, 5:04 AM IST

Updated : Aug 5, 2021, 7:35 AM IST

కరోనా పరిస్థితిని అధిగమించి ఈ ఆర్ధిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో బొగ్గు, విద్యుత్‌ అమ్మకాల ద్వారా రూ.8,180 కోట్ల టర్నోవర్‌ సాధించి రికార్డు నెలకొల్పామని సింగరేణి సీఎండీ శ్రీధర్‌ వెల్లడించారు. గతేడాది ఇదే కాలానికి సింగరేణి సాధించిన రూ.4,748 కోట్ల రూపాయల టర్నోవర్​పై ఇది 72 శాతం అధికం కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లోనే రికార్డు స్థాయిలో 800 కోట్ల రూపాయల లాభాలను ఆర్జించినట్లు శ్రీధర్‌ తెలిపారు.

గతేడాది ఇదే కాలానికి 303 కోట్ల రూపాయల నష్టాలను చవిచూసిన కంపెనీ ఈ ఏడాది సాధించిన అద్భుతమైన టర్నోవర్‌ రీత్యా.. 364 శాతం వృద్ధితో లాభాలను పొందిందని సీఎండీ వివరించారు. ఈ ఆర్ధిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో బొగ్గు అమ్మకాల ద్వారా రూ.6,949 కోట్ల టర్నోవర్‌ సాధించి.. గతేడాది ఇదే కాలానికి సాధించిన రూ.3,816 కోట్ల బొగ్గు అమ్మకాల టర్నోవర్​పై 82 శాతం వృద్ధిని నమోదు చేసిందన్నారు.

మంచిర్యాల జిల్లా జైపూర్‌ సింగరేణి థర్మల్‌ విద్యుత్ కేంద్రం ఈ తొలి నాలుగు నెలల్లో రూ.1,231కోట్ల విద్యుత్‌ అమ్మకాలు జరిపి గతేడాది కంటే 32శాతం వృద్దిని సాధించిందని సీఎండీ పేర్కొన్నారు. ఈ ఏడాది 700 లక్షల టన్నుల వరకు బొగ్గు సరఫరాకు పక్కా ప్రణాళికలతో ముందుకు పోతున్నామని సీఎండీ శ్రీధర్ వివరించారు.

ఇదీ చూడండి:

Singareni : విపత్కాలంలోనూ అనుకూల ఫలితాలు

Last Updated : Aug 5, 2021, 7:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.