భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం రామానుజవరం గ్రామానికి చెందిన బాడిస రాములు చిన్నక్క దంపదుల కుమారుడు సతీష్. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో సర్పంచ్‌గా గెలుపొందాడు. చిన్నతనం నుంచే వెయిట్ లిప్టింగ్పై ఆసక్తి ఉన్న సతీష్ తీరిక దొరికితే వ్యాయామశాలలో ప్రత్యక్షమయ్యేవాడు. కాలేజీ రోజుల్లో ఓ వ్యాయామశాలలో శిక్షణ తీసుకుని జిల్లా, రాష్ట్ర స్థాయి బాడీబిల్డింగ్ పోటీల్లో పలు పతకాలు సాధించాడు. సతీష్‌కు వెయిట్‌లిఫ్టింగ్, పవర్ లిప్టింగ్లోనూ ప్రావీణ్యం ఉంది.
గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు
2016లో రాష్ట్రస్థాయి శరీరసౌష్ఠవ పోటీల్లో ద్వితీయ స్థానంలో నిలిచాడు. 2017-18లో రాష్ట్రస్థాయి పోటీల్లో ద్వితీయ స్థానం, పవర్‌లిప్టింగ్‌లో ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థాయిలో ప్రథమస్థానం, వెయిట్లిప్టింగ్లో రాష్ట్రస్థాయిలో తృతీయస్థానం, ఇటీవల జరిగిన సౌత్ ఇండియా పోటీలో ప్రతిభ కనబర్చాడు.
గ్రామీణ యువతకు చేయూతనందిస్తూ..
సర్పంచ్‌గా గెలిచిన తర్వాత గ్రామంలోని యువతను ఈ క్రీడల్లో శిక్షణ ఇవ్వాలనుకున్నాడు. గ్రామంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో ఉచిత వెయిట్‌లిప్టింగ్ శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పాడు. గ్రామీణ యువతకు శరీర సౌష్ఠవం, వెయిట్‌లిప్టింగ్ అంశాల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నాడు. తన కోచ్ సహకారంతో విద్యార్థులను బాడీబిల్డింగ్‌లో ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతున్నాడు.
గ్రామీణ యువత ఇలాంటి క్రీడలపై పట్టు సాధిస్తే శారీరకంగా ధృడంగా తయారవ్వడమే కాకుండా గ్రామానికి పేరుతెచ్చేందుకు అవకాశం ఉంటుందంటున్నాడు. ఇతను ఇస్తున్న శిక్షణలో యువకులు రాటుదేలగా... పెద్దలు అభినందిస్తున్నారు.
ఇదీ చూడండి: నూటొక్క శతకాల ధీరుడు... ఈ ఆచార్యుడు