తెలంగాణలో పల్లెలు.. ప్రగతి దిశగా పయనిస్తున్నాయని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని అన్ని గ్రామపంచాయతీల్లో నాటేందుకు మూడు లక్షల వ్యయంతో తీసుకొచ్చిన మొక్కల్ని పరిశీలించారు. అనంతరం ఆరో విడత హరితహారంలో భాగంగా రేగా మొక్కలు నాటారు.
పంచాయతీల అభివృద్ధికి, సంక్షేమానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని రేగా కాంతారావు గుర్తు చేశారు. గ్రామాభివృద్ధి విషయంలో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి అలసత్వం వహిస్తే వేటు తప్పదని హెచ్చరించారు. గ్రామాల్లో అనుమతులు లేకుండా చెట్లు నరికితే రూ.ఐదు నుంచి పదివేల వరకు జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు.