ETV Bharat / state

Safety Helmet for Hearingloss People : బధిరుల కోసం సేఫ్టీ హెల్మెట్​.. ప్రభుత్వ ఉపాధ్యాయుడి వినూత్న ఆలోచన

Safety Helmet Desgined in Bhadradri Kothagudem : సాధారణంగా హెల్మెట్‌ ఉంటే ప్రాణాలను కాపాడుకోవచ్చని మనందరికీ తెలుసు. అయితే ఆ ప్రమాదమే జరగకుండా ముందే హెల్మెట్‌ మనల్ని అలర్ట్‌ చేస్తే ఎలా ఉంటుంది..! సరిగ్గా ఇదే ఆలోచన చేశాడు ఖమ్మంకు చెందిన దివ్యాంగుడు రాజాలి పాషా. పైగా ఆ ఆవిష్కరణ ఇంటింటా ఇన్నోవెటర్‌ కార్యక్రమానికి ఎంపికైంది. ఇదోక్కటే కాదు ఇంతకు ముందు కూడా సమాజహిత ఆవిష్కరణలు చేశాడు. అయితే అతడికి ఈ ఆవిష్కరణలు రూపొందించాలనే ఆలోచన ఎందుకచ్చింది..? టీచర్‌గా ఉన్న తను భవిష్యత్‌లో ఏం సాధించాలనుకుంటున్నాడు..? ఈ కథనంలో చూద్దాం.

Safety Helmet Desgined in Bhadradri Kothagudem
Safety Helmet for Hearingloss People
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 7, 2023, 5:15 PM IST

Safety Helmet for Hearingloss People బధిరుల కోసం సేఫ్టీ హెల్మెట్​.. ప్రభుత్వ ఉపాధ్యాయుడి వినూత్న ఆలోచన

Safety Helmet Desgined in Bhadradri Kothagudem : ఇతడో దివ్యాంగుడు.. పైగా ఆర్థిక ఇబ్బందులు. అయినా వీటన్నింటిని దాటి ప్రభుత్వ కొలువు సాధించాడు. అయితే సమాజం కోసం ఉపయోగపడే ఆవిష్కరణలు చేయటం అంటే ఇతడికి మక్కువ ఎక్కువ. అందులో భాగంగానే పలు రకాల ఆవిష్కరణలు రూపొందించి విజయవంతమయ్యాడు. ఇటీవల ప్రత్యేక హెల్మెట్‌ తయారు చేసి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు.

ఆటోవాలా వినూత్న ఆవిష్కరణ.. ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమానికి ఎంపిక

Telangana State Innovation Cell : ఇతడి పేరు ఎస్​కే రాజాలి పాషా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం సుభాష్‌నగర్‌లోని ఓ నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి. పుట్టుకతోనే వినికిడి లోపం. పైగా ఓ కాలికి పోలియో కారణంగా అంగవైకల్యం ఏర్పడింది. తన వైకల్యాన్ని తలుచుకుని రాజాలి పాషా ఏనాడూ వెనకడుగు వేయలేదు. బీఏ బీఈడీ, లైబ్రరీ సైన్స్ పూర్తి చేసి.. ఎడ్​సెట్ దివ్యాంగుల విభాగంలో రాష్ట్ర స్థాయి ప్రథమ ర్యాంకు సాధించాడు.

దివ్వాంగుల కోటాలో డీఎస్సీ మొదటి ర్యాంకు ఉద్యోగం సాధించి.. స్కూల్ అసిస్టెంటుగా ఉద్యోగం పొందాడు పాషా. ప్రస్తుతం ఖమ్మం గ్రామీణం మండలం గోళ్లపాడు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నాడు. బోధనలో తనదైన ప్రత్యేక ముద్ర కనబరుస్తూ.. ఇతర రంగాల్లో విద్యార్థులు రాణించేలా కృషి చేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం పాషా ఆత్మీయ మిత్రుడు ఒకరు భద్రాచలం బ్రిడ్జిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డాడు.

Bhadradri Kothagudem News : వెనుక నుంచి వచ్చిన పెద్ద వాహనం హారన్ శబ్దం వినిపించకపోవడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని గ్రహించాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు తాను.. ఓ సారి వెనుక నుంచి వచ్చే వాహన సైరన్‌ను గమనించకపోవడంతో ప్రమాదానికి గురయ్యాడు. ప్రతి నిత్యం వాహనాలు నడిపే దివ్యాంగులు, ముఖ్యంగా వినికిడి లోపం ఉన్న వారు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో గ్రహించాడు పాషా. ఇందుకు సరైన పరిష్కార మార్గం కనుగొనాలని సంకల్పించాడు.

అలా పలు విధాలుగా ప్రయత్నించి చివరకు ప్రత్యేక సాంకేతికత సాయంతో.. వినికిడి లోపం ఉన్న వారి కోసం ప్రత్యేకంగా హెల్మెట్ రూపొందించాడు. వెనుక నుంచి వచ్చే వాహనాలు హారన్ శబ్దం చేసినప్పుడు వినికిడిలోపం ఉన్న వాహనదారులకు సులభంగా గ్రహించేలా శిరస్త్రాణం రూపొందించాడు. ఈ హెల్మెట్‌లో రెండు మదర్ బోర్డులు, మరో రెండు బ్యాటరీలు, రిసీవర్, చిన్న బల్బులు అమర్చాడు.

వాహనం హారన్ మోగించగానే హెల్మెట్‌లోని రిసీవర్స్ ఆ శబ్దాన్ని గ్రహించి శబ్ద తరంగాలను కాంతి తరంగాలుగా మారుస్తాయి. ఫలితంగా హెల్మెట్‌లో బీప్ శబ్దం వచ్చిన తర్వాత దాని వెనక, ముందు భాగంలో అమర్చిన బల్బు వెలిగి వాహనదారుడిని అప్రమత్తం చేస్తుంది. దివ్యాంగులకు రహదారి భద్రత కల్పించేలా రాజాలీ పాషా రూపొందించిన ఈ హెల్మెట్ ప్రత్యేక గుర్తింపు సాధించింది.

Telangana Intinta Innovator Award : ఈ హెల్మట్‌ తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్‌కు ఎంపిక కాగా, రాజాలీ పాషా.. జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నాడు. ఇంతకు ముందు కూడా వీల్ ఛైర్ సమస్యలపై తయారు చేసిన ప్రాజెక్టు, డోర్స్ రెస్పాండ్ ఫైర్ యాక్సిడెంట్ ప్రాజెక్టులతో అందరినీ ఆకట్టుకున్నాడు. బధిరులు, మూగవారు వాహనాలను నడిపే సమయంలో ప్రమాదాలకు గురి కాకుండా రూపొందించిన హెల్మెట్‌ కోసం రాజాలీ పాషా ఏడాది పాటు శ్రమించాడు.

ఈ ప్రత్యేక హెల్మెట్‌ను తక్కువ ధరకే మార్కెట్‌లో విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అంటున్నాడు. భవిష్యత్‌లో మరిన్ని ఆవిష్కరణలు రూపొందించే ప్రయత్నాల్లో ఉన్నట్లు చెబుతున్నాడు. వైకల్యం వెంటాడుతున్నా తన ప్రతిభకు అవేమీ అడ్డుకావని నిరూపిస్తూ.. ముందుకు సాగుతున్న ఎస్ కే రాజాలి పాషా కథ అందరికీ స్ఫూర్తిదాయకమే.

"కొన్నేళ్ల క్రితం మా స్నేహితుడు హెల్మెట్​ పెట్టుకున్నప్పటికీ.. వెనుక నుంచి వస్తున్న వాహన హారన్ వినిపించకపోవడంతో​ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ముఖ్యంగా వినికిడిలోపం ఉన్నవారికి ప్రత్యేక హెల్మెట్​ తయారుచేయాలని నిర్ణయించుకున్నాను. వాహనం హారన్ మోగించగానే హెల్మెట్‌లోని రిసీవర్స్ ఆ శబ్దాన్ని గ్రహించి శబ్ద తరంగాలను కాంతి తరంగాలుగా మారుస్తాయి. ఫలితంగా హెల్మెట్‌లో బీప్ శబ్దం వచ్చిన తర్వాత దాని వెనక, ముందు భాగంలో అమర్చిన బల్బు వెలిగి వాహనదారుడిని అప్రమత్తం చేస్తుంది". - రాజాలి పాషా

Intinta Innovator Telangana : ప్రతిభను వెలికితీసే.. 'ఇంటింటా ఇన్నోవేటర్‌'

Automatic Sprayer for Poultry Farms : రసాయనాల పిచికారికి లేదిక శ్రమ.. యాదాద్రి యువకుడి వినూత్న ఆలోచన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.