భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రభుత్వం సీతారామ సాగునీటి ప్రాజెక్టును నిర్మిస్తోంది. నిర్మాణంలో భాగంగా అశ్వాపురం మండలం మొండికుంట గ్రామంలో భూములు కోల్పోయిన పదిమంది నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని కోరుతూ రైతులు నిరాహారదీక్ష చేపట్టారు. పనులు గతేడాది ప్రారంభం కాగా ఇప్పటివరకు పరిహారం చెల్లంచలేదని రైతులు వాపోయారు. ఉన్నతాధికారులకు చెప్పినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించే దాకా దీక్షను విరమించేది లేదని రైతులు స్పష్టం చేశారు.
ఇదీ చదవండిః ఈ చెట్టుకు ఏడు రకాల మామిడి కాయలు