భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని పంచాయతీల్లో పల్లె ప్రకృతి వనరులతో గ్రామాల ప్రజలు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేలా ప్రకృతి వనాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య తెలిపారు. స్థానిక విజయలక్ష్మి నగర్ పంచాయతీ పరిధిలో పల్లె ప్రకృతి వనం కార్యక్రమంలో కనకయ్య పాల్గొన్నారు.
ఇల్లందు మండలంలోని అన్ని పంచాయతీల్లో పల్లె ప్రకృతి వనం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నా పూర్తిస్థాయి వివరాలతో గ్రామాల్లోని ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడనుందని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండిః ఉద్రిక్తతకు దారి తీసిన పల్లె పార్కు బోర్డు ఏర్పాటు