భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావుని ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. సరైన వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లకు వేల రూపాయల ఇస్తున్న ప్రభుత్వం... ఆర్టీసీ కార్మికులకు అందులో సగం కూడా జీతాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు వెంటనే తీర్చేలా చూడాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: ఈటీవీ భారత్ 'వైష్ణవ జన తో' గీతానికి మోదీ అభినందన