భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నదులు, వాగులు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి. నీరు నిండిన చెరువులు అలుగు పోస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వాగులు పొంగి.. రాకపోకలు నిలిచిపోయాయి.
గుండాల మండలం ఆళ్లపల్లి మండలంలో మల్లన్న, కిన్నెరసాని వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇల్లందు మండలంలో ఇల్లందులపాడు, లలితాపురం చెరువులు అలుగు పోస్తూ కనువిందు చేస్తున్నాయి.
ఇవీ చూడండి: బైరామల్‌గూడ పైవంతెనను ప్రారంభించిన కేటీఆర్