కొవిడ్ రెండోదశ పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ సంచాలకుడు శ్రీనివాస రావు సూచించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని ఆ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రెండు జిల్లాల్లోని వైద్యాధికారులు కొవిడ్ పరిస్థితులను వివరించారు.
కరోనాను నియంత్రించడం పట్ల జిల్లాల వైద్యాధికారులు చేసిన కృషిని ఆయన అభినందించారు. భద్రం భద్రాద్రి కొత్తగూడెం నినాదంతో ముందుకు వెళ్తున్న కొత్తగూడెం జిల్లా వైద్యాధికారులను ఆయన ప్రశంసించారు.
ఇదీ చదవండి: రైతుల పోరాట పటిమకు వందనం.. బంద్‌లో పాల్గొంటం: కేసీఆర్