ETV Bharat / state

'అధైర్య పడకండి.. సీఎంతో చర్చించి అందరికీ న్యాయం చేస్తా' - రైతుల సమస్యలపై రేగా కాంతారావు హామీ

సీతమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మాణంతో భూములు కోల్పోయిన రైతులు ప్రభుత్వ విప్ రేగా కాంతారావుని కలిసి వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన రేగా కాంతారావు... సీఎం కేసీఆర్​ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Rega Kantaravu
'సీఎం దృష్టికి తీసుకెళ్లి... సమస్యల్ని పరిష్కరిస్తా...'
author img

By

Published : Sep 21, 2020, 8:19 PM IST

సీతమ్మ సాగర్​ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయే రైతుల సమస్యల్ని సీఎం కేసీఆర్​ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా కృషి చేస్తానని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు హామీ ఇచ్చారు. సీతమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మాణంతో భూములు కోల్పోయే మణుగూరు, అశ్వాపురం మండలాలకు చెందిన పలువురు రైతులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం రేగా కాంతారావుని కలిసి వినతిపత్రం అందజేశారు.

బీటీపీఎస్, సింగరేణి గనుల ఏర్పాటుతో భూములు కోల్పోయిన రైతులు రెండోసారి భూమిని కోల్పోయే పరిస్థితి వచ్చిందని రైతులు అన్నారు. సీతమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి సేకరించిన భూములకు ప్రభుత్వం మెరుగైన పరిహారం చెల్లించాలని కోరారు. అదేవిధంగా కాస్తుదారులను భూ నిర్వాసితులుగా పరిగణించాలని, అర్హులైన వారికి ఉద్యోగాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

పరిహారం చెల్లింపు విషయంలో రైతులు అధైర్య పడొద్దని కాంతారావు అన్నారు. అందరికీ ఆమోద యోగ్యమైన పరిహారాన్ని ప్రభుత్వం ఇస్తుందని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: 'రైతుల ఆత్మహత్యల వివరాలు ఇచ్చేందుకు వీలుకాదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.