ETV Bharat / state

చెట్టును మించిన దైవం లేదు : వనజీవి రామయ్య - భద్రాచలంలో వనజీవి రామయ్య దంపతులు

చెట్లే సకల జీవరాశికి ప్రాణవాయువు అందించేది. అలాంటి చెట్లను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందంటూ గుర్తు చేస్తున్నారు వనజీవి రామయ్య దంపతులు. భద్రాచలంలో జేడీ ఫౌండేషన్​, ఛాంబర్​ ఆఫ్ కామర్స్​ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛభారత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆస్పత్రి ప్రాంగణంలో మొక్కలు నాటారు.

ramaiah attended swachh bharat programme in bhadrachalam
చెట్టును మించిన దైవం లేదు : వనజీవి రామయ్య
author img

By

Published : Dec 20, 2020, 3:55 PM IST

మొక్కలు నాటండి- సకల జీవరాశిని రక్షించండి అంటూ సందేశమిస్తున్నారు వనజీవి రామయ్య దంపతులు. ఎక్కడ మొక్కలు నాటే కార్యక్రమం జరిగినా ముందుండి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో జేడీ ఫౌండేషన్​, ఛాంబర్​ ఆఫ్​ కామర్స్​ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛభారత్​ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆస్పత్రి ప్రాంగణంలో మొక్కలు నాటారు.

పట్టణంలోని అంబేద్కర్ సెంటర్​లో ఉన్న ఆస్పత్రిలో మొక్కను పరిశీలించారు. దాదాపు ఆరు సంవత్సరాల వయస్సు గల మొక్కను ఒక చోట నుంచి తీసి మరోచోట నాటి బతికించిన పట్టణానికి చెందిన శంకర్​ను వనజీవి రామయ్య సన్మానించారు. మొక్కను తప్పనిసరి పరిస్థితుల్లో తీసేయాల్సి వస్తే మొక్కను నరకకుండా వేరే ప్రదేశంలో నాటడం మంచి కార్యక్రమమని అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు శంకర్, కంభంపాటి సురేశ్​, గోళ్ల భూపతి రావు, దేశప్ప తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:బోర్డులు రద్దు చేసి క్లస్టర్ వ్యవస్థ తీసుకొస్తాం : ఎంపీ అర్వింద్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.