భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఉదయం కురిసిన వర్షం కారణంగా సింగరేణి కార్మికుల విధులకు ఆటంకం ఏర్పడింది. మొదటి షిఫ్ట్ విధులకు వెళ్లాల్సిన కార్మికులు వెళ్లలేకపోయారు.
రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి జీకే ఉపరితల గనిలో బొగ్గు ఉత్పత్తి పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఉపరితల గనిలోకి వాహనాలను అనుమతించ లేదు. పనులు నిలిచిపోవడం వల్ల మూడు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.