భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఆర్టీసీ సమ్మెలో భాగంగా కార్మికులు, వామపక్షాల నాయకులు, బ్రిడ్జి సెంటర్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఆర్టీసీ ఉద్యోగుల చెవుల్లో ప్రభుత్వం పువ్వులు పెడుతోందని..ఉద్యోగులంతా చెవిలో పూలు పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. సుమారు గంటసేపు ధర్నా చేయడం వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి భారీగా ట్రాఫిక్ జామైంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆందోళనకారులను చెదరగొట్టారు.
ఇవీ చూడండి : ప్రభుత్వ ఖజానాకు భారీగా మద్యం ఆదాయం