ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న తమకు కనీస వేతనం ఇప్పించాలని కోరుతూ పలువురు వలస కూలీలు కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పరిసర ప్రాంతాల్లో ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న తమకు దినసరి వేతనంలో అన్యాయం జరుగుతోందని... రోజంతా నిర్విరామంగా పనిచేస్తున్న రోజు వారి కూలీ రూ. 200 మించి రావడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యను పట్టించుకుని స్థానికనేతలు చొరవ చూపి కనీస వేతనం ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
వలస కార్మికుల వెతలు... బట్టీల్లో మగ్గిపోతున్న జీవితాలు
బతుకుదెరువు వెతుక్కుంటూ వచ్చిన తమకు కనీస కూలీ ఇవ్వడం లేదని ఇటుక బట్టీల్లో పని చేస్తున్న వలస కార్మికులు వాపోతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్న వలస కార్మికులు తమ వేతన సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.