అధిక వర్షాల నేపథ్యంలో రానున్న గోదావరి వరదలపై అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. భద్రాచలం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో గోదావరి వరదల గురించి, తీసుకోవాల్సిన జాగ్రతలపై జిల్లా అధికారులతో కలెక్టర్ అనుదీప్ సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఏటా ఆగస్టు నెలలో భద్రాచలంలో వరద ముంపు పొంచి ఉండగా... ఈ ఏడాది జూన్ నుంచి అధిక వర్షాలు ఉండటం వల్ల వరదలు వచ్చే అవకాశం ఉందన్నారు. వరదల ముంపుపై స్థానిక అధికారులంతా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. సన్నాహక సమావేశంలో శాఖల వారిగా చేపట్టాల్సిన చర్యలపై సమగ్ర కార్యాచరణ
ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు.