భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మూడోదశ ప్రాదేశిక ఎన్నికలకు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. వేసవి కాలం దృష్ట్యా... ఓటర్లు ఉదయమే పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. జిల్లా వ్యాప్తంగా మూడో దశలో 6 జడ్పీటీసీలు, 56 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం 311 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం స్థానిక సంస్థల ఎన్నికల్లో 1903 మంది సిబ్బందిని కేటాయించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా గుర్తించినందున ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది.
ఇవీ చూడండి: ప్రారంభమైన స్థానిక సంస్థల తుదిదశ పోలింగ్