భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో బ్రిడ్జి సెంటర్ వద్ద పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న భద్రాచలం అటవీ ప్రాంతాల్లో సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 2 వరకు వాడవాడలా మావోయిస్టు వారోత్సవాలు నిర్వహించాలని... మావోయిస్టులు కరపత్రాలు విడుదల చేశారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఎజెన్సీ ప్రాంతాలైన చర్ల వెంకటాపురం, వాజేడు మండలాలతో పాటు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న మండలాలకు సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు బస్సుల రాకపోకలను నిలిపివేశారు.
ఇవీ చూడండి: బిహార్లో వరద బీభత్సం- ఎటుచూసినా నీరే